తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం,
సంగెం మండల కేంద్రం నుండి గవిచర్ల వేళ్ళు ప్రధాన రహదారి కి ఇరువైపులా చెట్లు,ముళ్ల పొదలు పెరిగి అటుగా మండల కేంద్రానికి వెళ్ళు ప్రయాణికులకు వాహన దారులకు అనేక ఇబ్బందులు పడుతున్నారని విషయం సంగెం ఎస్.ఐ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లిగా వెంటనే స్పందించిన ఎస్.ఐ రోడ్డుకు ఇరుప్రక్కల ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను డోజర్ సహాయంతో తొలగించి ఉదరతను చాటుకున్నారు. చెట్లు పెరిగి మూలమలుపుల వద్ద యాక్సిడెంట్లు కాకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామని ఎస్.ఐ వంశీకృష్ణ తెలిపారు.అలాగే వాహన దారులు ప్రజలు ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.




