శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దేవరహట్టి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతులకు పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు విడుదల సందర్భంగా బుధవారం రైతుల సమావేశంలో మడకశిర శాసన సభ్యులు ఎమ్మెస్ రాజు. మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి. టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని టిడిపి మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, మండల సింగల్విండో ప్రెసిడెంట్ మద్దనుకుంటప్ప, మండల కార్యదర్శి శ్రీనాథ్ మూర్తి, టిడిపి మండల్ క్లస్టర్ ఇంచార్జ్ చిత్ర శేఖర్ యాదవ్ లు తెలిపారు. దేవరట్టి గ్రామానికి చెందిన మండల్ క్లస్టర్ ఇంచార్జ్ చిత్ర శేఖర్ తోటలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు రైతుల సమావేశం జరుగుతుందని వారు తెలిపారు. అర్హులైన రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 2000. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అందుకుగాను నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
రేపు గుడిబండ మండలం లో పర్యటించనున్న ఎమ్ ఎల్ ఏ, మాజీ ఎమ్మెల్సీ
RELATED ARTICLES



