
ఎన్టీఆర్ జిల్లా,నందిగామ
ది:- 13/11/2025
_• సంతకాల సేకరణ పేరుతో ట్రాఫిక్ కు అంతరాయం_
_• విద్యా సంస్థలను ప్రవేటీకరణకు 42,50 జీవోలు తెచ్చింది వైసీపీ_
_• గతంలో 31మంది నందిగామ కేవిఆర్ కాలేజీ విద్యార్థులను అరెస్ట్ చేయలేదా ?_
_• కల్తీ లడ్డు,కల్తీ లిక్కర్ వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలు_
• _ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి వైసీపీ నేతలు తట్టుకోలేక పోతున్నారని జనసేన నాయకులు కొట్టె బద్రి అన్నారు._
• _మెడికల్ కాలేజీ వ్యవహారంపై నందిగామలో వైసీపీ నేతల తీరు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నదని బద్రి తెలిపారు. సంతకాల సేకరణ పేరుతో నందిగామ పట్టణ గాంధీ సెంటర్ నందు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని బద్రి వెల్లడించారు. ప్రస్తుతం వైద్య కళాశాలలను పీపీపీ విధానం అమలుచేయడంపై మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ నేతలు, గతంలో తమ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రవేటీకరణకు తెచ్చిన జీవో నెంబర్ 42,50 రద్దు చేయమని అలాగే నందిగామ కేవిఆర్ కాలేజీని ప్రైవేట్ పరం కాకుండా ఎయిడెడ్ గానే కొనసాగించాలని నిరసన తెలుపుతుంటే సివిల్లో ఉన్న కానిస్టేబుల్స్ చేత జుట్టు పట్టించి 31మంది విద్యార్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి చందర్లపాడు,కంచికచర్ల పోలీస్ స్టేషన్స్ తరలించి మొండితోక జగన్మోహన్ రావు గారు అరెస్ట్లు చేయించలేదా ? వైద్య కళాశాలు 33 యేళ్ల తరువాత,తిరిగి ప్రభుత్వానికే చెందుతాయని.. మెడికల్ కళాశాలలు పూర్తి అయితే 1500 సీట్లు వస్తాయని..ఇందులో 725 సీట్లు పూర్తిగా ఉచితమని ప్రకటించారు. ఎన్టీఆర్ వైద్య సేవల కింద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామన్నారు. మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తెస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మినిస్టర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కానీ వైసీపీ నేతలు రాష్ట్రమంత సంతకాల సేకరణ పేరుతో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టిస్తూ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నిజంగా వైసీపీ నాయకులకు, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలన్నారు. వైసీపీ నేతల చేసిన కల్తీ లడ్డు,కల్తీ లిక్కర్ వ్యవహారాలను కప్పిపుచ్చుకుంటున్నారని బద్రి తెలియజేశారు._



