నందిగామ, నవంబర్ 7, దేశభక్తిని చాటే వందేమాతరం గీతం రచించబడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నందిగామ పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో గురువారం నాడు ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య గారు అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, మహిళా సంఘ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా వందేమాతరం గీతాన్ని సమూహంగా ఆలపించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ గీతం ఇచ్చిన ప్రేరణను స్మరించుకుంటూ, మనందరం దేశభక్తి, ఐక్యతా స్ఫూర్తిని ఎల్లప్పుడూ నిలబెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ —“వందేమాతరం గీతం కేవలం పదాలు కాదు,అది భారత మాత పట్ల మనకున్న అనురాగానికి ప్రతీక. ఈ గీతం మనకు ఇచ్చిన దేశప్రేమ భావన తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. యువత ఈ భావనను తమ హృదయాలలో నాటుకోవాలి,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, వ్యవసాయ అధికారులు, పట్టణ ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చివరగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ సౌమ్య గారు పుష్పాంజలి అర్పించారు.
వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా నందిగామ వందేమాతరం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
RELATED ARTICLES



