నందిగామ, నవంబర్ 3: ఇటీవల తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రైతుల నష్టాలను అంచనా వేయడం,తగిన పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ, తుఫాను ప్రభావంతో పాడైన ప్రత్తి, మొక్కజొన్న, పెసలు వంటి ప్రతి పంటను రైతు వారీగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రంగు మారిన వరినీ సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
నియోజకవర్గంలోని రైతులు మార్క్ఫెడ్ ద్వారా పెసలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొక్కజొన్న కొనుగోలు త్వరితగతిన ప్రారంభించాలన్న అభ్యర్థనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై తంగిరాల సౌమ్య గారు సానుకూలంగా స్పందించి, సమస్యను వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్న నాయుడు గారికి ఫోన్ ద్వారా వివరించారు.
మంత్రివర్యులు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు తెలిపారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి రైతు పట్ల ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.
తుఫాను ప్రభావిత పంటలపై చర్యలకు అధికారులతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు సమీక్ష..
RELATED ARTICLES



