భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం: మణుగూరులోని తెలంగాణ భవన్పై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులకు చోటు లేదని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామిక విలువలను పక్కనబెట్టి దాడుల పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు. నాడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాలయంపై, మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి దాడులు జరిపారని ఆమె గుర్తు చేశారు.
రేగా కాంతారావు తన సొంత ఇంటిని పార్టీ కార్యాలయంగా మార్చుకుని, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని సీతాలక్ష్మి తెలిపారు. అలాంటి నాయకుడి కార్యాలయంపై దాడులు చేయడం ప్రజాస్వామిక వ్యవస్థకు మచ్చ తెచ్చే చర్యగా అభివర్ణించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను గాయపరిచి, పార్టీ కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం చేసి, నిప్పు పెట్టిన కాంగ్రెస్ గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. విధ్వంసకర వాతావరణం సృష్టించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
మణుగూరు తెలంగాణ భవన్పై దాడి అప్రజాస్వామికం: కాపు సీతాలక్ష్మి
RELATED ARTICLES



