

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూ టీవీ
తేదీ: 28.10.2025 (మంగళవారం)
స్థలం: అశ్వారావుపేట నియోజకవర్గం
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో దమ్మపేట, చండ్రుగొండ, సీతాయిగూడెం, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, అశ్వారావుపేట మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ, రక్తదాన శిబిరం, రోగులకు పాలు–పండ్ల పంపిణీ, అలాగే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని మంత్రివర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



