
TEJANEWSTV TELANGANA :కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కాపు సీతామహాలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో, వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు మరియు పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు.
ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రేగా కాంతారావు, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అదే సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సీతామహాలక్ష్మి గారు త్వరగా ఆరోగ్యవంతంగా మారాలని ప్రార్థించారు.



