సంగెం మండలం పలు గ్రామాల్లో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , గుంటూరుపల్లి,గవిచర్ల,తిమ్మాపూర్ గ్రామాలలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన గార్లపాటి హరిప్రసాద్ రావు,కుడికాల రమేష్,కోడూరి ఎల్లమ్మ కుటుంబాలను పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ,పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని వారికి మనో దైర్యం చెప్పారు.అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామ పార్టీ అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి,మాజీ సర్పంచి మాదినేని రాంరెడ్డి, అడ్డగట్ల విజయ్ లను చల్లా ధర్మారెడ్డి పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా
RELATED ARTICLES



