ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో శివ నాగమణి దేవాలయంలో శుక్రవారం నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ మణికంఠ నవయుగ కోలాటం బృందం ప్రత్యేకంగా పాల్గొని భక్తులను అలరించింది.
నాగుల చవితి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు నాగలక్ష్మి, డి. దుర్గ, అలాగే దేవాలయ కమిటీ సభ్యులు సమన్వయం చేశారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులు భారీగా హాజరై పూజల్లో పాల్గొని నాగదేవతకు పాలు, గంధం, పుష్పాలు సమర్పించారు.
కోలాటం బృందం ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు, భక్తి గీతాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామస్తులు, భక్తులు ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు
అగ్రహారం గ్రామంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
RELATED ARTICLES



