రుద్రవరం మండల కేంద్రంలోని భాస్కర నందీశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఓ అయ్యప్ప మాలదారుడిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే — రుద్రవరం గ్రామానికి చెందిన ఏరువ కృష్ణమూర్తి వారి కూతురు మరియు అల్లుడు రామయ్యలు ఆలయంలో పూజకు వచ్చిన అయ్యప్ప మాలదారుడు రామచంద్రారెడ్డిపై దాడి చేసినట్లు సమాచారం. గురుమాలను తెంపి, పిడిగుద్దులతో విరుచుకుపడ్డారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మునుపటి రోజు ఎరువ కృష్ణమూర్తి, ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద తాళం వేసి, “అయ్యప్ప మాలదారులు ఆలయంలోకి రావొద్దు” అని అడ్డుకున్నారని గ్రామస్థులు తెలిపారు. దీనిపై రామచంద్రారెడ్డి ప్రశ్నించడంతో, మరుసటి రోజు ఉదయం శివాలయంలో పూజ అనంతరం ఆయనపై దాడి జరిపినట్లు చెప్పబడుతోంది.
బాధితుడు రుద్రవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దాడి చేసిన వారిని విచారణకు పిలిపించారు. ఎస్‌ఐ గారు ఆలయ ఈవో గారిని ఘటనపై వివరణ కోరగా, ఆలయానికి ఏరువ కృష్ణమూర్తికి ఎలాంటి అధికారిక బాధ్యతలు లేవని, కేవలం భక్తుడిగా మాత్రమే వస్తుంటారని ఈవో గారు తెలిపారు.
ఈ ఘటనపై రుద్రవరం ఎస్‌ఐ మాట్లాడుతూ, “దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
భక్తి మార్గంలో అయ్యప్ప మాల ధారణలో ఉన్న భక్తుడిపై దాడి హేయమైన చర్యగా పరిగణించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, హిందూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
రుద్రవరం భాస్కర నందీశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప మాలదారుడిపై దాడి
RELATED ARTICLES



