
TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఎం జె పి బాలికల కళాశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన పోతురాజు ప్రసాద్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినిలు ఉత్తమ ఫలితాలు అందుకున్నారని, ప్రిన్సిపల్ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ విద్యార్థుల శ్రేయస్సు కొరకు, విద్యార్థుల భవిష్యత్తుకై ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు, కళాశాల సిబ్బందితో అందరితో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉంటూ ఉత్తమ ఫలితాలతో పాటు రాష్ట్రస్థాయిలో కళాశాలకు గుర్తింపు తెచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్రవకలిగా కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మండల సింగిల్ విండో అధ్యక్షుడు మదన కుంటప్ప జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, జిల్లా లింగాయత్ సముదాయ అధ్యక్షుడు దుర్గేష్, గుడిబండ ఎంపీటీసీ వనజ శశిధర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప, మండల మైనార్టీ అధ్యక్షుడు షబ్బీర్ లాయర్ శివకుమార్ డాక్టర్ సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి మండల టిఎన్టియుసి అధ్యక్షుడు జయరాం, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీరామ్ మాజీ ఎంపిటిసి వెంకటేష్, కళాశాల సిబ్బంది, బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



