
TEJANEWSTV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల ప్రభుత్వ అధికారులు ఎంపీడీవో కేశవరెడ్డి, ఎమ్మార్వో శ్రీధర్ స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ మండల వ్యవసాయ అధికారి వీర నరేష్, ఏపీవో జగదీష్ పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఇతర ఉన్నత అధికారులు సిబ్బందితో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ ఇంధన వాహనాలను ఉపయోగించడం వల్ల వాతావరణం కాలుష్యానికి గురి అవుతుందని ఇంధన రహిత వాహనాలను ఉపయోగించాలని, క్లీన్ ఎయిర్ క్లీన్ ఏపీ నినాదంతో ర్యాలీ నిర్వహించి పాఠశాల విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు వాయు కాలుష్య నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలు పరిసరాలలో మొక్కలను చెట్లను పెంచడం వల్ల కలిగే లాభాలు వివరించారు ఈ కార్యక్రమంలో మండల అన్ని శాఖల అధికారులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు.



