భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 17-10-2025
కొత్తగూడెం:
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో, మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పిలుపు మేరకు, రేపు 18-10-2025 శనివారం నాడు జరుగనున్న తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని కోరుతున్నాను.
ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, మహిళా నాయకురాలు, కార్యకర్త, యువజన విభాగాలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీసీ నాయకులు ఈ బంద్‌లో చురుకుగా పాల్గొనాలి.
ఈ బంద్ ద్వారా బీసీలకు న్యాయమైన హక్కులు, రిజర్వేషన్లపై ప్రభుత్వానికి బలమైన సందేశం ఇవ్వగలుగుతాం. అందుకే ప్రతి ఒక్కరూ పార్టీ శ్రేణిగా, సామాజిక న్యాయ పోరాటకారుడిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
తెలంగాణ బంద్‌ను బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయవంతం చేయండి – వనమా వెంకటేశ్వరరావు
RELATED ARTICLES



