
TEJANEWSTV
హోళగుంద మండల కేంద్రంలో ఆలూరు టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రసాద్ తనయుడు వైకుంఠం శ్రీరామ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు స్థానిక హోళగుంద మండలంలో కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైకుంఠం శ్రీరాములు గారు ఆరోగ్యం ఐశ్వర్యలతో, విజయాలతో ప్రజాసేవలో అడుగులు వేస్తూ మరింత బలంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి , క్లస్టర్ -2 ఇంచార్జ్ వీరేంద్ర, బూత్ మెంబర్లు వలి భాష, తిక్క స్వామి, శాలి అమాన్,రారావి సిద్ధ, మైలారి,గౌరేష్ ,జనసేన మండల కన్వీనర్ అశోక్,జనసేన నాయకులు వెంకటేష్,టిడిపి యువ నాయకులు సిద్ధప్ప,అల్తాఫ్,గ్రామ వైకుంఠం అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



