Friday, November 7, 2025

కోగిలతోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మహర్దశ….. మెగా డీఎస్సీ ద్వారా నూతనంగా 14 మంది ఉపాధ్యాయులు

కోగిలతోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మహర్దశ….. మెగా డీఎస్సీ ద్వారా నూతనంగా 14 మంది ఉపాధ్యాయులు

TEJA NEWS TV :
కర్నూలు జిల్లా హొళగుంద మండలం కోగిలతోట గ్రామానికి మెగా డీఎస్సీ ద్వారా 14 మంది టీచర్లు రావడం వలన గ్రామంలోని ప్రజలు ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్త పరిచారు. ఈరోజు మా ఊరికి ఇంతమంది టీచర్లు రావడం మాకు సంతోషకరంగా ఉంది అని,మాది మారుమూల గ్రామం అయినప్పటికీ ఇంత మంది ఉపాధ్యాయులు రావడం ఎంతో సంతోషంగా ఉందని
ఈ సంతోషకరమైన వాతావరణంలో ఉపాధ్యాయులను పూలమాలలతో సత్కరించి విద్యార్థినీ,విద్యార్థినీయులు తల్లిదండ్రుల సమక్షంలో నూతనంగా వచ్చిన 14 మంది ఉపాధ్యాయులను పూలు జల్లతో డప్పు,వాయిద్యాల ఊరేగింపులతో కోగిలతోట గ్రామ బస్టాండ్ నుంచి ఉన్నత పాఠశాలకు ర్యాలీగా అంగరంగ వైభవంగా తీసుకురావడం జరిగింది.. అదేవిధంగా గ్రామ ప్రజలు,S.M.C చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలుపుతూ, వారికి నాణ్యమైన విద్యను బోధించి,బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని, ఇన్ని రోజులు మా పిల్లలకు టీచర్లు తక్కువగా ఉన్నందువలన విద్యార్థులకు చదువు కొరత ఏర్పడిందని, ఆ కొరతను కూటమి ప్రభుత్వం భర్తీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ  విద్యార్థిని విద్యార్థినీయులను  ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు పిల్లలు అందరూ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular