TEJANEWSTV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ లో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ప్రస్తుత సమాజంలో బాలికలు అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరిచి క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తహసిల్దార్ శ్రీధర్. ఎంపీడీవో కేశవరెడ్డి. ఎంఈఓ ప్రసాద్ రెడ్డిలు పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రమైన గుడిబండ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం గుడిబండ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలు పోటీ తత్వాన్ని అలవర్చుకొని అన్ని రంగాల్లోనూ ఉన్నతంగా రాణించి ప్రతిభ కనబరిచి ఆడపిల్లలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని. అప్పుడే వారికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో బాలికలను చిన్నచూపు చూడకుండా అన్ని రంగాల్లోనూ వారిని ప్రోత్సహించాలని తద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారమవుతామని ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా కృషి చేయాలని వారు కోరారు. బాలికల సంరక్షణ కోసం ప్రస్తుతం అనేక చట్టాలు అమలులో ఉన్నాయని వాటిని గుర్తించుకొని ప్రతి ఒక్కరు ఆడ మగ అనే తేడా లేకుండా బాలికలను అభివృద్ధి వైపు దూసుకెళ్లే విధంగా సహకరించాలని వారు కోరారు. బాలికలను వేధించడం. వారి హక్కులను హరించడం. వారిని మానసికంగా శారీరకంగా వేధించడం. బాలికల అక్రమ నిర్బంధం అక్రమ రవాణా. బాలికల హక్కులను హరించడం లాంటివి ఎవ్వరూ చేయరాదని అలా చేస్తే అది పెద్ద నేరమవుతుందన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 10 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు వకృత్వపు పోటీలు ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన బాలికలకు బహుమతులు ప్రధానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో. మండల స్పెషల్ ఆఫీసర్ రామచంద్రప్ప టిడిపి మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప ప్రధానోపాధ్యాయుడు గోవిందప్ప సిడిపిఓ రహమతీయ ఆర్డిటి ఏ టి ఎల్ మీనాక్షి ఐసిడిఎస్ సూపర్వైజర్ కమలమ్మ ఏపిఎం తిప్పన్న. ఎస్ రాయపురం టీచర్ అరుణ అంగన్వాడీ టీచర్లు మహదేవమ్మ లక్ష్మీదేవి నాగమణి శాంతమ్మ త్రివేణి సుజాత దేవి అమ్మ జయమ్మ మంజుల గంగమ్మ కళ్యాణమ్మ మహిళా పోలీసులు దేవిబాయి జయమ్మ శాంత లక్ష్మి జయలక్ష్మి ప్రతిభ తదితరులు పాల్గొన్నారు
గుడిబండ లో ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం
RELATED ARTICLES



