TEJANEWSTV :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ..
సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ కి 15వేల రూపాయలు వారి అకౌంట్లో వేయడం చాలా సంతోషమని తెలియజేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…
నాలుగు రోడ్ల కూడలి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ఆటో డ్రైవర్లతో, ఆటో నడుపుతూ ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…
ఆళ్లగడ్డ వ్యాప్తంగా 1244 మంది డ్రైవర్లకు 1.96 లక్షల రూపాయలు, ఇవ్వడం జరిగిందని, అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3 ఆటో స్టాండ్లు త్వరలోనే పూర్తి చేస్తామని, ఆటో డ్రైవర్లకు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..
చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం తోనే ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నిండాయని, ప్రతి వస్తువుపై జిఎస్టి రేట్లు తగ్గించి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసాం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు…
మన ఆళ్లగడ్డ లోని డీఎస్సీ కి 200 మంది ఎంపిక అవడం చాలా సంతోషమని, మా నుండి ఏం అవసరం వచ్చినా ఏ టైంలో అయినా మా వాట్సాప్ సేవలు మీకు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక సమస్య పరిష్కరిస్తామని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..
ఆళ్లగడ్డ అభివృద్ధికి మీరందరూ సహకరిస్తే మీరు ఊహించనంత రీతిలో ఆళ్లగడ్డ అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు….








