TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుడిబండ మండలంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నుండి సూపర్ జిఎస్టి మరియు సూపర్ సేవింగ్స్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, వ్యవసాయ శాఖలో రైతులకు వ్యవసాయ పరికరముల పైన జిఎస్టి 12% నుండి 5% వరకు తగ్గించడం జరిగిందని. ఈ అంశం పైన ట్రాక్టర్లతో ర్యాలీ చేయడం నిర్వహించారు.
వివిధ పనిముట్ల పైన ట్రాక్టర్ పైన జిఎస్టి తగ్గించడం వలన రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని ,అదేవిధంగా రైతులకు తక్కువ ధరలోనే వ్యవసాయ పనిముట్లు యంత్రములు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని,ఈ అవకాశాన్ని రైతులందరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో , తహశీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో కేశవ రెడ్డి, రైతు సేవ కేంద్రం అధికారులు ప్రకాష్, నాగేష్, సృజన్ అదేవిధంగా సింగిల్ విండో ప్రెసిడెంట్ మదనకుంటప్ప, మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, బిజెపి మండల అధ్యక్షులు పలారం ఉమేష్, మాజీ హాస్పిటల్ చైర్మన్ శివకుమార్, జిల్లా లింగాయిత్ అధ్యక్షులు దుర్గేష్, ఎంపీటీసీ సభ్యులు వనజ శశిధర్, క్లస్టర్ ఇంచార్జ్ భీమ్ రాజు, కేకే పాళ్యం లక్ష్మణ, తెదేపా నాయకులు,కార్యకర్తలు, మరియు రైతులు పాల్గొన్నారు.
గుడిబండలో: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం
RELATED ARTICLES



