కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం హొళగుంద మండల కేంద్రంలో నిర్వహించారు.
టీడీపీ ఇన్చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుయువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి, మండల కన్వీనర్ టి.తిప్పయ్య, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చిదానంద, జనసేన మండల కన్వీనర్ అశోక్ తదితర నాయకులు ఆధ్వర్యం వహించారు.
స్థానిక బీసీ కాలనీ, బుడుగజంగం ఏరియా, బుడబుక్కల కాలనీల్లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సూపర్-6 హామీలలో భాగంగా రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరిస్తున్నామని తెలిపారు.
అలాగే ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, వాహనాలు తదితరాలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయని, ఇది ప్రజా పరిరక్షక పాలన ఫలితమని వివరించారు.
కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, డీలర్ లింగప్ప, టిడిపి నాయకులు మల్లికార్జున, హుస్సేన్ పీరా, లక్ష్మన్న, వీరేంద్ర, హనుమంతు, కోనేరు భాస్కర్, మంగయ్య, సిద్దిక్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
RELATED ARTICLES



