కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం తుజాల్‌పూర్ గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ క్లస్టర్ మేనేజర్ హిమాకుమార్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ పంట రైతులకు అధిక లాభాలను అందిస్తుందని తెలిపారు.
పంట పెట్టుకుంటే చెట్టు సబ్సిడీతో పాటు డ్రిప్ సబ్సిడీ కూడా లభిస్తుందని, అలాగే సంవత్సరానికి ఎకరాకు రూ.4,200 మెయింటెనెన్స్ ఖర్చు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు. నాలుగు సంవత్సరాల వరకు రైతులు అంతర పంటలు వేసుకోవచ్చని, ఆరవ సంవత్సరం తర్వాత చెట్లు పెద్దవి అవడంతో నీడ కలుగుతుందని, ఆ నీడలో కోకో పంట వేసుకోవచ్చని సూచించారు.
నాలుగో సంవత్సరం నుంచే ఆయిల్ పామ్ పంట దిగుబడి వస్తుందని, రైతుల సౌకర్యార్థం మండలంలోనే కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హిమాకుమార్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య, ఫీల్డ్ ఆఫీసర్ సత్యనారాయణ, గ్రామ రైతులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలి
RELATED ARTICLES



