Friday, September 12, 2025

హోళగుంద: అమెరికా టారిఫ్ ల (సుంకాలు) పెంపునకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం

TEJA NEWS TV


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిలుపుమేరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వామ పక్షులు పార్టీలు ఈరోజు హోళగుంద బస్టాండు నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది సిపిఐ మండల కార్యదర్శి బి మారెప్ప మాట్లాడుతూ కర్నూలు.. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు సార్వభౌమత్వ పరిరక్షణకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలని, ట్రంప్ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ ట్రంప్ సర్కార్ భారత ప్రయోజనాలను సార్వభౌమత్యాన్ని దెబ్బ తీస్తున్నా,కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దేశ ప్రజలను అవమాన పరచడమేనని, వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు టిడిపి కూటమి కూడా ఏమాత్రం ప్రయత్నించకపోవడం సరికాదని వారు పేర్కొన్నారు ట్రంప్ తో సహా అమెరికా పెత్తందారులు, దేశాన్ని అవమాన పరుస్తూ ప్రకటనలు చేస్తున్న మోడీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. అమెరికా వీసాలకు నిబంధనలు కఠిన తరం చేయడం,కాలపరిమి తగ్గించడం,జరిమానాలు విధించడం,వంటి కారణాలతో ఎన్నో ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థుల కలలు పేక మేడల కూలిపోతున్నాయని వివరించారు.ఇప్పటికే అమెరికా వెళ్లిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.భారతీయ సరుకులు దిగుమతి పై సుంకాన్ని 50% పెంచుతూ అమెరికా అధ్యక్షులు చేసిన ప్రకటనతో మన దేశ ఉత్పత్తుల పై తీవ్ర ప్రభావం  పడిందని తెలిపారు. ఆక్వా, టెక్ స్టైల్,గార్మెంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఘోరంగా పడిపోయాయని దేశ సముద్ర ఉత్పత్తుల్లో 40% ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయని తెలిపారు. ఏటా సుమారు 2000 కోట్ల డాలర్ల విలువైన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి అవుతుందని పేర్కొన్నారు. రొయ్యల ధరలు పడిపోవడంతో సముద్ర తీర ప్రాంతాల్లోనే రొయ్యలు,చేపల  పరిశ్రమపై ఆధారపడి జీవించే వేలాది మంది కార్మికులు ఉపాధికి ఇబ్బందికరంగా మారిందని వివరించారు. ఇందులో అత్యధికులు మహిళా శ్రామికులు, మన ఎగుమతులపై సుంకాలు  పెంచి మరోవైపు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపాలని, అమెరికా షరతులు  విధిస్తోందని తెలిపారు. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు, దేశ సార్వభౌమత్య పరిరక్షణ  కోసం అమెరికా  ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకిస్తూ డిమాండ్ చేస్తున్నాం  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కన్వీనర్ అమానుల్ల ఏఐటీయూసీ తాలూకా  ఉపాధ్యక్షులు కె రంగన్న సిపిఐ నాయకులు సిద్దలింగా రుద్రగౌడ్డ రామతుల్ల కురువ కోటి చందు స్వామి  చాగప్ప మల్లయ్య సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular