TEJA NEWS TV: హొళగుంద మండల కేంద్రం, ఈరోజు: మదాసి మాదరి కురువ సంఘం మండల గౌరవాధ్యక్షులు శ్రీ కాళికా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మానేకుర్తి గ్రామంలో జరిగిన సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కురువల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం కురువ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది.
ఈ ఘటనపై మండల సలహాదారులు శేషప్ప, రామాంజనేయులు డాక్టర్, ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి కురువ మల్లయ్య, సంఘ నాయకులు SK గిరి, మండల అధ్యక్షుడు పంపాపతి తదితరులు స్పందిస్తూ—ఇది కురువల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ముద్దటమాగి గాదలింగ, MD హళ్లి సర్పంచ్ సుధాకర్, వందవాగిలి సర్పంచు భర్త శేషప్ప, నేరానికి సోమప్ప, ఎలార్తి సర్పంచ్ తమ్ముడు చిన్న దర్గాప్ప, సంగోళ్లి రాయన్న ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి మంజునాథ్ గౌడ్, మండల కమిటీ మెంబర్ సిద్ధప్ప, గజ్జల్లి డీసీ బొజ్జన్న, రమేష్, చిన్న మంజు, బాల్లేప్ప, మల్లికార్జున, పూజారి రామలింగ, హొళగుందా మల్లికార్జున, అడివప్ప, మంజు, వాట్టెప్ప, పెద్దహ్యట సోమశేఖర్, ఎలార్తి కట్టే సిద్దప్ప, గోపాల్, బసవ తదితరులు పాల్గొన్నారు.
కురువ కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై, సంఘీభావం వ్యక్తం చేశారు.
మానేకుర్తి గ్రామంలో శ్రీ భక్త కనకదాస్ విగ్రహం ధ్వంసం – కురువ సంఘం ఆగ్రహం, వెంటనే అరెస్టు డిమాండ్
RELATED ARTICLES