భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ, సెప్టెంబర్ 12:
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చండ్రుగొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజలకు అవసరమైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం” అని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మార్వో సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తాం – ఎమ్మెల్యే జారె
RELATED ARTICLES