భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ, సెప్టెంబర్ 11 :
ముస్లిం ఐక్య వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 20న భద్రాచలం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరగబోయే “ప్రవక్త ముహమ్మద్ స.అ.సం జీవిత సందేశం మానవాళికి” సభకు సంబంధించి గోడ పత్రికను చండ్రుగొండ జామా మస్జీద్ జదీద్ ఆవరణలో ఆవిష్కరించారు.
సంఘం బాధ్యులు నాగుల మీరా, షేఖ్ రబ్బానీ మాట్లాడుతూ ప్రవక్త ముహమ్మద్ ఆదర్శవంతమైన జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అని, ఆయన జీవన సందేశాన్ని తెలుసుకోవడం ద్వారా మానవతా విలువలతో నిండి జీవించగలమని అన్నారు. ఈ సభ అందరికీ ఒక సువర్ణావకాశమని, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆసీఫ్ పాషా, అన్వర్ మూర్తుజా, షకీల్ రషీద్, అస్గర్, మౌలాలి, మస్తాన్ సహబ్, అలిమ్ బాబా, ఆబిద్ హుస్సేన్, ఆఫ్రిద్, ఆశిష్ బాబా తదితరులు పాల్గొన్నారు.
గోడ పత్రిక ఆవిష్కరణ
RELATED ARTICLES