భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 10:
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమర సాహసంతో పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కురిమెల్ల శంకర్ అన్నారు.
బుధవారం బాబు క్యాంప్ బీసీ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాస్ మాట్లాడుతూ –
భూమి, భుక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ త్యాగం అణగారిన వర్గాల హక్కుల సాధనలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలు యువత, మహిళలకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని, సమాజ అభివృద్ధికి అందరూ ఆమె పోరాటస్ఫూర్తిని అనుసరించాలన్నారు.
చాకలి ఐలమ్మ జీవితం స్త్రీ సాధికారతకు, సామాజిక సమానత్వానికి మార్గదర్శకమని, ఆమె చూపిన దారి మానవ విలువలు, ధైర్యసాహసాలకు పాఠమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్నాభాయ్, నరేందర్, దుర్గాప్రసాద్, ముత్యాల ప్రభాకర్, అన్నందాసు రాజు తదితరులు పాల్గొన్నరు.