YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమం పత్తికొండలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి, వాలంటీర్స్ వింగ్ సంయుక్త కార్యదర్శి కప్పట్రాళ్ల దివాకర్ నాయుడు ముఖ్య పాత్ర పోషించారు.
అంబేద్కర్ సర్కిల్ నుండి RDO కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, గిట్టుబాటు ధరల సమస్య తదితర అంశాలపై వినతిపత్రం RDO గారికి అందజేశారు.
ఈ సందర్భంగా MLA బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, “రైతులకు సకాలంలో యూరియా అందించాలి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇవి లేకపోతే రైతుల పక్షాన మరింత తీవ్రంగా పోరాటం చేస్తాం” అని హెచ్చరించారు.
ఎరువుల కొరతపై వైసీపీ నేతల ర్యాలీ – రైతులకు బాసటగా అన్నదాత పోరు
RELATED ARTICLES