TEJA NEWS TV
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఈనెల మూడవ తేదీన రాజకీయ గొడవలకు పాల్పడిన వ్యక్తులను సిఐ మంజునాథ ఆదేశాల మేరకు కోసిగి ఎస్సై హనుమంత రెడ్డి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కోసిగి ఎస్సై హనుమంత రెడ్డి తెలిపిన వివరాల మేరకు కోసిగి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు పరుసాని నరసన్న, దుర్నిగేని వెంకన్న, నాగిరెడ్డిలపై అదే గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు వాచ్మెన్ రాముడు వెంకటేష్, దొరగాడు, నరసప్ప అను నలుగురు వ్యక్తులు ఇనుప రాడ్ ల, వేట కొడవళ్ళతో దాడి చేసి గాయపరిచారని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఫోటోలను వాట్సాప్ లో డీపీలుగా పెట్టుకున్నారు అన్న కారణంతో మోటార్ సైకిల్ లపై టిడిపి కార్యకర్తలు అడ్డగించి వాట్సాప్ స్టేటస్ లో టిడిపికి సంబంధించిన ఫోటోలు ఎందుకు పెట్టుకున్నారని వారితో గొడవ పెట్టుకొని విచక్షణ రహితంగా కొట్టి హత్యయత్నానికి పాల్పడ్డారు. బాధితులు నరసన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించగా కోసిగిలో నిందితులను అదుపులోకి తీసుకొని దాడిలలో ఉపయోగించిన బైక్ లు వేటకొడవలి ఇనుప రాడ్ లను స్వాధీనం చేసుకోని వారిపై FIR నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై హనుమంత రెడ్డి తెలిపారు. ఎస్సై హనుమంత రెడ్డి తో పాటు కోసిగి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కోసిగి మండలంలో రాజకీయ గొడవలకు పాల్పడిన వారికి రిమాండ్
RELATED ARTICLES