నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్‌లో 43వ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన వరసిద్ధి వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నారు.
బుధవారం రోజున స్వామి వారికి **రూ.3 కోట్లు 10 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ** చేశారు. కరెన్సీ నోట్లతో ముస్తాబైన వినాయకుడు దివ్య కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనార్థులను ఆకట్టుకుంటున్నారు.
వినాయకుడి ఈ విశిష్ట రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి వెల్లివిరిసింది.
వాసవి మార్కెట్లో కరెన్సీ వినాయకుడు – రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరణ
RELATED ARTICLES