TEJA NEWS TV
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గుదిబండ మండలం కూగీరన పాళ్యం గ్రామానికి చెందిన జన సైనికుడు పి హెచ్ శేఖర్ తమ స్వగ్రామంలో ఉండే మారెమ్మ గుడి నిర్మాణాభివృద్ధికి తన వంతుగా
20,000/ రూపాయలను విరాళంగా అందించారు.
అలాగే గుడిబండ మండలం జన సైనికులందరు కేక్ కట్ చేసి ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహక సభ్యులు చిరునాగ్,కిరణ్, శివరాజ్,మధు,మల్లేష్,లోకేష్,సిద్దేశ్ తదితరులు పాల్గొన్నారు.