Tuesday, September 16, 2025

విజయవాడకు బయలుదేరిన గుడిబండ టీడీపీ నేతలు — వక్కలిగా కార్పొరేషన్ చైర్మన్‌గా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారానికి మద్దతు

TEJA NEWS TV

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వక్కలిగా కార్పొరేషన్ చైర్మన్ గా రేపు పదవి బాధ్యతలు చేపడుతున్న మడకశిర మండలం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి బయలుదేరిన గుడిబండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు*

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ ఎమ్మెస్ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, తెలుగుదేశం పార్టీ గుడిబండ మండలం అధ్యక్షులు లక్ష్మీ నరసప్ప, సింగల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ ల ఆధ్వర్యంలో రాష్ట్ర కుంచింటి వక్కలిగా కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న లక్ష్మీనారాయణ కు తోడుగా,గుడిబండ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడకు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, సింగల్ విండో డైరెక్టర్ ప్రకాష్
మైనార్టీ సెల్ అధ్యక్షులు షబ్బీర్, రంగనాథ్ ,చిగతూర్పి మంజునాథ్, మోహన్ మందలపల్లి మంజునాథ్, శశి, ఈరన్న ,వెంకటరమణ, రాళ్లపల్లి పంచాయతీ మంజునాథ్, నర్సే గౌడ, జగదీష్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular