నందిగామ పట్టణంలో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన శ్రేణులు, చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఉదయం ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేసి, విద్యార్థులతో పర్యావరణం పై మొక్కలు నాటించారు.
సాయంత్రం గాంధీ సెంటర్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కేక్ కట్ చేసి, బాణాసంచా వెలుగుల మధ్య అభిమానులతో వేడుకలు జరిపారు.
ఈ కార్యక్రమంలో పూజారి రాజేష్, పోలిశెట్టి వరుణ్, తాటి వెంకటకృష్ణ, గుండాల బాలాజీ, పాములపాటి రాజేష్, వేపూరి నాగేశ్వరరావు, అమ్మినేని జ్వాలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నందిగామలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES