Sunday, September 14, 2025

డేటా ఎంట్రీ, టైలరింగ్‌లో మహిళలకు ఉచిత శిక్షణ

నందిగామ టౌన్ :
నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ, నందిగామలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌. శ్రీనివాసరావు, కాలేజీ ప్రిన్సిపల్ ఎం. రమేష్ బాబు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.

వారి వివరాల ప్రకారం, 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సులో, 5వ తరగతి పైబడిన వారికి టైలరింగ్ కోర్సులో శిక్షణ కల్పించబడుతుంది. ఈ శిక్షణ కార్యక్రమం రెండు నెలలపాటు కొనసాగుతుందని తెలిపారు.

ఎంపికైన మహిళలకు ప్రత్యేక శిక్షణ సౌకర్యం కల్పించడంతో పాటు శిక్షణ పూర్తయిన అనంతరం ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని అధికారులు తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ కూడా అందజేయబడుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు తమ మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్‌తో కలిసి సెప్టెంబర్ 10, 2025లోపు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ, నందిగామలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 8919951682 నంబరులో సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular