TEJA NEWS TV
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన చిలుకూరి విజయకుమార్ శెట్టి (66) శుక్రవారం లండన్ వెళ్తున్న కుమార్తెను శంషాబాద్ విమానాశ్రయంలో దింపి తిరిగి వస్తుండగా, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటనలో ఆయన భార్య మాధవి, డ్రైవర్ వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎమ్మిగనూరు: కుమార్తెను లండన్ కు పంపి తిరిగివస్తూ తండ్రి మృతి
RELATED ARTICLES