భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
29.08.2025
చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో గల ధన్బాద్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఎదురుగా ఉన్న పెద్ద చెట్ల కొమ్మలు భవనానికి అతి సమీపంలో ఉండుట వలన వర్షపు నీరు భవనం పైకి చేరి గోడలు తడిసి, నీరు కారుతున్న పరిస్థితి నెలకొంది.
దీని కారణంగా చికిత్స కోసం వచ్చే రోగులు, వారి బంధువులు భయపడుతున్నారు. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెట్ల కొమ్మలను కత్తిరించడం ద్వారా భవనంపై నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
చుంచుపల్లి మండల ప్రజల వినతి
RELATED ARTICLES