*మహానంది*
యూరియా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహానంది తహాశీల్దార్ రమాదేవి హెచ్చరించారు. మంగళవారం మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని గఫారియా, దీప్తి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎరువులు, పురుగు మందుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర రెడ్డి, ఎస్సై రామ్మోహన్ రెడ్డిలతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం రసాయనిక, ఎరువులు, పురుగు మందులు సంబంధించిన స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులు, గోడౌన్లు, పరిశీలించారు. ఈపాస్ మిషన్ బ్యాలెన్స్ గోడౌన్ లో ఉన్న స్టాకు కు, స్టాక్ రిజిస్టర్ లో ఉన్న స్టాకు కు సమానంగా ఉండాలన్నారు. ఎవరైనా యూరియా, ఇతర ఎరువులను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే ఈసీ యాక్ట్ 1955 ప్రకారం 6a కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమతులు లేని ఎరువులు మరియు పురుగుల మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. గోడౌన్లలో నిలువలు ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో జేజి బాబు, బసాపురం వీఆర్వో వెంకట లక్ష్మమ్మ పాల్గొన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతులకు యూరియా అమ్మాలి
RELATED ARTICLES