*కూటమి ప్రభుత్వముతోనే పేదల సొంతింటి కలకు సాకారం*
*ఉచిత ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకోండి-చిన్నహ్యట శేషగిరి*
పేదల పక్షపాతి,విపక్షాల విషప్రచారానికి సంక్షేమంతో సమాధానం చెప్పేటటువంటి కూటమి ప్రభుత్వ రథ సారథి మాన్య ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విప్లవాత్మక పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చేపట్టిన అర్హులైన పేదలందరికీ ఉచితంగా మూడు సెంట్లు ఇంటి స్థలాల పంపిణీ పధకం కొరకు హొళగుంద మండల ప్రజలు తమ పంచాయతీల్లోని ఆయా సచివాలయ కేంద్రాల్లో తప్పక దరఖాస్తు చేసుకోవాలని తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యాట శేషగిరి పేర్కొన్నారు.
హొళగుంద మండల ప్రజలు ఉచిత ఇంటి స్థలాలకై దరఖాస్తు చేసుకొనుటకు తమ యొక్క భార్యాభర్తల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గృహిణి యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నకళ్ళను దరఖాస్తు వెంట జతపరచి తమ తమ వార్డులలోని సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని ఐడి నెంబరును పొందవలెనని తెలిపారు.
మరియు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన నవ్యాంధ్రప్రదేశ్ లో సంక్షేమ శఖం నడుస్తుందని అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులలోపు అసంపూర్ణంగా ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల ఇంటి నిర్మాణాలను త్వరితతిన పూర్తి చేసి సత్వర గృహప్రవేశాలు కూడా నిర్వహించడమే కాక రాబోయే 2026 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికై ఓ మహత్తర విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టవంతమైన ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు.
ఉచిత ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకోండి
RELATED ARTICLES