భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు “నారి మహిళా ఆరోగ్య సంకల్పం” అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కాలంబ పిలుపు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు మహిళల ఆరోగ్యం, బాలికల రక్షణ దృష్ట్యా ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండల ప్రభుత్వ బాల బాలికల పాఠశాలలతో పాటు కొన్ని స్లమ్ ఏరియాల్లో ఈ కార్యక్రమాన్ని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ –
➡️ మహిళలు, బాలికలు సురక్షితంగా ఉండడం,
➡️ క్యాన్సర్ నివారణ,
➡️ రీప్రొడక్టివ్ సమస్యల నివారణ
అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు, INTC నాయకులు రజాక్, సుజాతనగర్ మండల అధ్యక్షుడు చింతలపూడి శేకర్, మాజీ కౌన్సిలర్ కనుకుట్ల శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, మాజీ MPTC నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లలో బండ్ల రజనీ, పొదిలి జ్యోతి, బోడ దివ్య, గుగులోతు కమలమ్మ, పందాల సరిత, బర్ల నాగమణి, బూరుగుపల్లి పద్మశ్రీ, సున్నం లక్ష్మి, మచ్చల పార్వతి, కొల్లు పద్మ, గాలిపల్లి స్వరూప, కూరపాటి సౌజన్య, గుగులోతు ప్రియాంక, బడుగు కృష్ణవేణి, వసంతాల రాజేశ్వరి, వేముల రాజ్యలక్ష్మి, గుర్రం జయసుధ, జయమ్మ, జయ, అరుణ, భవాని, విద్య తదితరులు సన్నిహితమయ్యారు.
నారి మహిళా ఆరోగ్య సంకల్పం – రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
RELATED ARTICLES