ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ప్రముఖ వ్యక్తి, న్యాయవాది కిరణ్ కుమార్ వర్మపై పోలీసులు చట్టవిరుద్ధంగా షీటు తెరిచి, అతని ఫోటోను పోలీస్ స్టేషన్ ఎదుట ప్రదర్శించారని ఆరోపణలపై, ఆయన ములుగు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం, గతంలో ఎటూరునాగారంలో ఏఎస్పీగా పనిచేసిన **సిరిశెట్టి సంకీర్త్**, వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన **బండారీ కుమార్**, అలాగే వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేసిన **రేగ అశోక్** లపై క్రిమినల్ డిఫామేషన్ కేసులో నోటీసులు జారీ చేసింది.
కోర్టు వారిని ఆక్యూజ్డ్ నెంబర్ 1, 2, 3లుగా పేర్కొని, తదుపరి వాయిదాకు హాజరుకావాలని సమన్లు పంపింది.
ఏఎస్పీ, సీఐ, ఎస్ఐలపై క్రిమినల్ డిఫామేషన్ కేసు
RELATED ARTICLES