నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో కర్ణాటక బీజాపూర్‌కు చెందిన కుటుంబం ఏడాది చిన్నారిని కారులో వదిలి దేవాలయంలోకి వెళ్లగా, ఊపిరాడక ఇబ్బంది పడుతున్న శిశువును గమనించిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ సమయస్ఫూర్తిగా కారు అద్దాలు పగులగొట్టి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు.
ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రివర్యులు వంగలపూడి అనిత సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలపగా, మంగళవారం సాయంత్రం మహానంది పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి చంద్రశేఖర్‌ను శాలువా కప్పి, మెమెంటో అందజేసి సన్మానించారు. తోటి సిబ్బంది ఆయన ధైర్యసాహసాలకు శభాష్ అంటూ ప్రశంసలు కురిపించారు.
చిన్నారి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌కు సన్మానం
RELATED ARTICLES