సంగెం మండలంలోని కృష్ణానగర్, ఎల్గూర్ రంగంపేట, ఎలుగూరు స్టేషన్, నర్సానగర్, బిక్కోజీ నాయక్ తండా, కుంటపల్లి, చింతలపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు ₹2500, వృద్ధులకు ₹4000, వికలాంగులకు ₹6000 పింఛన్, కళ్యాణలక్ష్మిలో తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగ భృతి ₹3000 వంటి హామీలు అన్నీ మరిచిపోయి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.
ఈ సమావేశాలకు రాష్ట్ర నాయకుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ప్రధాన కార్యదర్శి జక్క మల్లయ్య, సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, సమన్వయ కమిటీ సభ్యులు పూజారి గోవర్ధన్, మన్సూర్ అలీ, మండల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
కాంగ్రెస్ హామీలు ఎక్కడ? – బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సారంగపాణి ప్రశ్న
RELATED ARTICLES