మెదక్ జిల్లా చేగుంట పట్టణంలోని శ్రీ కృష్ణవేణి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాగోపిక వేషధారణలతో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ లింగమూర్తి మాట్లాడుతూ –
“ప్రతి సంవత్సరం మా పాఠశాలలో జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. పిల్లలను శ్రీకృష్ణ, గోపికల వేషాలలో అలంకరించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ పండుగకు పిల్లలు, తల్లిదండ్రులు సమానంగా ఉత్సాహం చూపిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇచ్చే సహకారం మా బృందానికి బలాన్ని ఇస్తుంది” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నాగరాజు, రేణుక, లింగమూర్తి, ప్రిన్సిపాల్ రామకృష్ణన్, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
**శ్రీ కృష్ణవేణి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు**
RELATED ARTICLES