భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ వృత్తి ధర్మంలో నిబద్ధత, కర్తవ్యపరమైన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు *ఉత్తమ అధికారి*గా ప్రశంసా పత్రం లభించింది.
జిల్లా కేంద్రంలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ కలిసి ప్రశంసా పత్రాన్ని అందజేసి శివరామకృష్ణను అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. “వృత్తిపట్ల అంకిత భావంతో ఈ గుర్తింపు రావడం నాకు ఆనందంగా ఉంది” అని శివరామకృష్ణ తెలిపారు. సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, మండల ప్రజలకు తన కృతజ్ఞతలు తెలిపారు.
చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణకు ఉత్తమ అధికారి అవార్డు
RELATED ARTICLES