అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం గ్రీన్ కౌంటీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో హైదరాబాద్కు చెందిన నలుగురు సభ్యులు సజీవదహనమయ్యారు. వీరు అట్లాంటా నుంచి డల్లాస్ వెకేషన్కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురయ్యారు.
మృతులు తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులు మరియు వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో వెంకట్ డ్రైవ్ చేస్తుండగా, ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన మినీ ట్రక్ కారును ఎదురుగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారు మంటల్లో పూర్తిగా ఆవిరైందని పోలీసులు తెలిపారు.
దారుణ ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేపట్టారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు తెలిపారు. ఈ హృదయవిదారక ఘటనతో తల్లిదండ్రులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: హైదరాబాద్ కుటుంబం సజీవదహనం
RELATED ARTICLES