చేగుంట జులై 4
మెదక్ జిల్లా, చేగుంట మండలం, చేగుంట తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్ తంగేళ్లపల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే పిఆర్సి ని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నగదు రైతా ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జీవో 317 బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. చేగుంట మండలంలోని, రెడ్డిపల్లి, అనంతసాగర్, రుక్మాపూర్, ఇబ్రహీంపూర్, బోనాల, పులిమామిడి, కిష్టాపూర్, కొండాపూర్, వల్లభాపూర్, పొలంపల్లి, పాఠశాలల్లో తపస్ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, తపస్ జిల్లా బాధ్యులు, మల్లారెడ్డి, దేశపతి కృష్ణమూర్తి, ప్రభాకర్, సుమతి, తిరుపతి,మండల బాధ్యులు మేముల శ్రీనివాస్, వనిత, మురళీకృష్ణ, నరసింహారెడ్డి, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం వెంటనే పి ఆర్ సి ని ప్రకటించాలి
RELATED ARTICLES