Friday, July 4, 2025

ఎల్బీ స్టేడియంలో జరుగు బహిరంగ సభకు కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు

మెదక్ జిల్లా, చేగుంట మండలం,  జులై 4న ఎల్ స్టేడియం లో జరిగే గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళనం బహిరంగ సభకు విజయవంతం చేయడానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి  ఆదేశాల మేరకు ఈ రోజు R & B గెస్ట్ హౌస్ లో కార్యాచరణ ప్రణాళిక నిర్వహణ కోసం  చేగుంట మండల కోఆర్డినేటర్ జనగామా మల్లారెడ్డి మరియు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.  వారు మాట్లాడుతూ టిపిపిసి బొమ్మ మహేష్ కుమార్ మాజీ  పిలుపు మేరకు రేపు జరగబోయే మహాసభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అద్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే వస్తున్న తరుణంలో చేగుంట మండల నుండి అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల 150 నుండి 200 మంది కార్యకర్తలు తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు M. శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, మొజామిల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు బోయినీ శ్రీకాంత్, సీనియర్ నాయకులు పుర్ర ఆగం,మహిళా కాంగ్రెస్ నాయకురాలు కురుమ లక్ష్మి, నాగులు,రాకేష్, రాంపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular