సంగెం మండలం పల్లారుగూడ, ఎలుగూరు స్టేషన్ (సపావత్ తండ), కుంటపల్లి గ్రామాలలో వివిధ కారణాలతో మృతిచెందిన వారి కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.
మృతుల వివరాలు..*పల్లారుగూడ.
పల్లారుగూడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కోడూరు రఘు తండ్రి కోడూరు లింగయ్య ఇటీవలే మృతిచెందగా నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిప్రగాఢ సానుభూతి తెలియజేశారు.లింగయ్య మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.సపావత్తండ(ఎల్గూర్స్టేషన్)
సపావత్ తండ కి చెందిన బిఆర్ఎస్ నాయకులు బదావత్ బొంద్యా అకాల మరణం చెందగా వారి పార్థీవ దేహాన్ని సందర్శించి మాజీ ఎమ్మెల్యే నివాళులు అర్పించారు.కుంటపల్లి గ్రామం..*
కుంటపల్లి గ్రామంలో మృతిచెందిన దడిగేల మొగిలయ్య మృతదేహాన్ని సందర్శించి మాజీ ఎమ్మెల్యే నివాళులు అర్పించారు.అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా గ్రామంలో ఇటీవలే కన్నతల్లిపై పెట్రోల్ పోసి కొడుకు నిప్పంటించి ఘటనలో మృతిచెందిన ముత్తినేని వినోద కుటుంబాన్ని చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఘటనకు గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, చిర్ర రాజు, మండల మాజీ సర్పంచ్ గుండేటి బాబు,మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
RELATED ARTICLES