నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లి గిరిజన తాండ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్స్ డే సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
హాస్పిటల్ ఎండి డాక్టర్ సారెడ్డి నరసింహారెడ్డి ఆదేశాల మేరకు .. స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం గ్రామానికి విచ్చేసి సుమారు 250 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయా వ్యాధులకు సంబంధించిన మందులను కూడా అందజేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి ఎన్ లక్ష్మిరెడ్డి, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక, ప్రముఖ డయాబెటిక్ వ్యాధి నిపుణులు డాక్టర్ యశ్వంత్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ అనీషా తదితరులు రోగులను పరీక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాలంలో అంటూ వ్యాధుల బారిన ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కలుషిత నీరు కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హాస్పిటల్ ఎండి డాక్టర్ నరసింహారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ శిబిరంలో హాస్పిటల్ ఫార్మాసిస్టు మధుసూదన్ , ఆఫ్తమాలజిస్ట్ అజయ్, నాయక్, రవి,బబ్లు, తదితరులు పాల్గొన్నారు
డాక్టర్స్ డే సందర్భంగా గిరిజన తండాలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం సూపర్ సక్సెస్
RELATED ARTICLES