భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 26-05-2025
కొత్తగూడెం.
సిరిసిల్లలో జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ కేటీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడికి దిగడం ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నారు.
ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది పోలీసులు నియంత్రణ కోల్పోయిన సంకేతమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు ముప్పుగా అభివర్ణించారు.
“పోలీసు అన్నలారా… మీరు తెలంగాణ మట్టిలో పుట్టినవారు. మీ కుటుంబాల కష్టాలను మర్చిపోకండి. అధికారుల ఆదేశాల పేరిట సత్యాన్ని పక్కనబెట్టి అన్యాయానికి మద్దతుగా నిలవడం బాధాకరం,” అంటూ భావోద్వేగంతో స్పందించారు వనమా.
కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో ఎవరి ఫోటో వేయాలన్నది వ్యక్తిగత, రాజకీయ హక్కు అని తెలిపారు. దానిపై దాడులు చేయడం, పోలీసులే బూతులు తిట్టడం, నాయకులను చితకబాదడం సభ్యసమాజం తలదించుకునే చర్యగా ఖండించారు.
“ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి మూడో కన్నుగానే నిలుస్తుంది. ఇందుకు తప్పక మూల్యం చెల్లించాలి,” అని ఆయన హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు దారుణం –మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు
RELATED ARTICLES