యన్టీఆర్ జిల్లా నందిగామ
ప్రభుత్వ అధికారులకు యోగ క్లాసులు నిర్వహించిన యోగ గురుజి గాడిపర్తి సీతారాం
ముఖ్య అతిథులుగా విచ్చేసి యోగా కార్యక్రమం లో పాల్గొన్న ఆర్డీఓ. బాలకృష్ణ , తహశీల్దార్ సురేష్ బాబు, కమీషనర్ జి.వి.రమణ బాబు
జూన్ – 21 విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో ప్రధాని నరేంద్ర మోడీ యెగా కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య , ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్.జి., లక్ష్మి శ వారి ఆదేశానుసారం మే నెల తేదీ 21 – 05 – 2025 నుండి తేదీ 21 – 06 – 2025 వరకు యోగ మాసం గా ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బుధవారం ఉదయం యోగ మాసం ప్రారంభం సందర్భంగా సన్నాహక యోగ క్లాసులు ప్రారంభ కార్యక్రమాలలో భాగంగా నందిగామ ఆర్డీఓ,తహశీల్దార్, మున్సిపల్ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులకు యోగ క్లాసులు నిర్వహించిన యోగా గురుజి గాడిపర్తి సీతారాం.
యోగ క్లాసులకు ఆర్డీఓ .బాలకృష్ణ ,తహశీల్దార్ సురేష్ బాబు , మున్సిపల్ కమీషనర్ జి.వి. రమణ బాబు ముఖ్య అతిధులుగా విచ్చేసి యోగా కార్యక్రమం లో పాల్గొని యోగా చేశారు .
ఈ సందర్భం గా ఆర్డీఓ.బాలకృష్ణ మాట్లాడుతూ మానసిక విశ్రాంతి కి శారీరక ఆరోగ్యానికి యోగ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని , ఈ రోజు యోగా చేయటం ఎంతో సంతోషంగా ఉందని, యోగ గురుజి సీతారాం అధికారులు అందరికీ యోగ బాగా నేర్పించార ని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఆర్డీఓ, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ అధికారులకు యోగ క్లాసులు నిర్వహించిన యోగ గురుజి గాడిపర్తి సీతారాం
RELATED ARTICLES